ఫ్లాష్ న్యూస్:- గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల పంజా...!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిలాల్లోని నెన్నెల మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్న లంబాడి తండా, పెద్ద లంబాడి తండా లలో గుడుంబా తయారు చేస్తున్నారన్న సమాచారం



 మేరకు నెన్నెల  ఎస్ఐ శ్యామ్ పటేల్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ అధికారులు మరియు సిబ్బంది తో కలిసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించగా సుమారు 1000 లీటర్ల గుడుంబా  తయారీ బెల్లం పానకంలను గుర్తించి ధ్వంసం చేయడం జరిగింది. ఇలా దాడి చేసి ధ్వంసం చేయడం రెండవసారి గతంలో కూడా దాదాపు 1000 లీటర్లు పానకం ధ్వంసం చేయడం పై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గుడుంబా సేవించి చాలా మంది అనారోగ్య పాలు కావడం , కొంత మంది దానికి భానిసై రాత్రికి రాత్రి నిద్రలో చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. రెండు నెలల్లో ఎస్. ఐ శ్యామ్ పటేల్ రెండు సార్లు తనిఖీ నిర్వహించి పట్టుకోవడం విశేషమైనది.

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by