DBN TELUGU:-
- ఫోరెన్సిక్ సైన్స్ ఎంట్రెన్స్ టెస్ట్ లో క్వాలిఫై అయిన 20మంది సిఓఈ విద్యార్ధులు.
- 67 మార్కులతో టాప్ లో నిలిచిన జాడి రోహన్ రాజ్.
- అభినందించిన గురుకులాల జాయింట్ సెక్రెటరీ కంభంపాటి శారద.
ఆల్ ఇండియా లెవల్ లో ప్రతిష్టాత్మకమైన ఏఇయఫ్ సెట్- 2024(ఆల్ ఇండియా ఫోరెన్సిక్ సైన్స్ఎంట్రెన్స్ టెస్ట్)లో తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ(సిఓఈ)బెల్లంపల్లి విద్యార్థులు ఏకంగా 20మంది కౌన్సిలింగ్ కు అర్హత సాధించారు.జాడి రోహన్ రాజ్ వంద మార్కులకు గాను 67మార్కులతో టాప్ లో నిలిచినట్లు ప్రిన్సిపల్ ఐనాల సైదులు తెలిపారు.
2024-25 విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేషన్ అడ్మీషన్స్ కై ఈ నెల 23న ఆన్లైన్ లో ఏఇయఫ్ సెట్- 2024 (ఆల్ ఇండియా ఫోరెన్సిక్ సైన్స్ ఎంట్రెన్స్ టెస్ట్) జాతీయస్థాయిలో జరిగింది.దీనికి హాజరైన 20మంది సిఓఈ విద్యార్ధులు ఉత్తమ ప్రతిభ చూపి కౌన్సిలింగ్ అర్హత సాధించడం విశేషం. వచ్చే నెలలో దీనికి సంబందించిన కౌన్సిలింగ్ తేదీలను త్వరలో ప్రకటిస్తారు.
-- క్వాలిఫై అయిన విద్యార్ధుల వివరాలు:-
జాడి రోహన్ రాజ్, యరెకర్ ప్రదిప్, పుట్టల శివ, బొర్కుట్ శ్రావణ్, కొండగొర్ల రిషి, కోట ఆభిరాం, దుర్గం శ్రీరాం, కామెర విష్ణు చైతన్య, దుగుట అంజి, ముప్పిడి శ్రీకర్, గోగర్ల జశ్వంత్, ఆడె నవనీత్, బండారి శివ మూర్తి, ఆకుతోట శివసాయి, బెడ్డల రాకెష్, ఎల్లకుల సంజయ్ క్రిష్ణ, తీగల అశ్రీత్, రావుల ఆభిరాం, ఎనుగుల వివేక్.
ఉత్తమ ప్రతిభతో కౌన్సిలింగ్ కు అర్హత సాధించిన విద్యార్ధులను ప్రిన్సిపాల్ ఐనాల సైదులు శుక్రవారం కళాశాలలో ప్రత్యేకంగా అభినందించారు.అదేవిధంగా సంక్షేమ గురుకులాల జాయింట్ సెంక్రెటరీ సక్రూనాయక్ విద్యార్ధులను ఫోన్ ద్వారా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి సిఓఈ విద్యార్ధులు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపి ఇతర విద్యార్ధులకు ఆదర్శంగా నిలవడం పట్ల ఆదిలాబాద్ రీజియన్ సంక్షేమ గురుకులాల సత్తాచాటారని ఆమె ఆనందం వ్యక్తంచేశారు.
ఈ కార్యక్రమంలో హైయ్యర్ ఎడ్యుకేషన్ సెల్ కోఆర్డినేటర్ అవునూరి రవి అధ్యాపకులు పిన్నింటి కిరణ్, మిట్టా రమేష్, నాగిని శ్రీరామవర్మ,ముద్దసాని శోభ, తిరుపతి, యం.ది రఫి, చందా లక్ష్మీనారాయణ, ఆకినేపల్లి రాజేష్, కట్ల రవీందర్, అనుముల అనిరుద్, సమెందర్,తదితరులు పాల్గొన్నారు.

