DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి నియోజకవర్గంలో 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ చేసి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... ఎందరో నాయకుల కృషి ఫలితమే మన ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నిరంజన్, మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్, వైస్ చైర్మన్ సుదర్శన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, పట్టణ BRS పార్టీ అధ్యక్షుడు నారాయణ, BRS, BRSY, BRSY నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

