కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రంలో సుస్థిర పాలన.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- దేశంలో, రాష్ట్రంలో సుస్థిర పాలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు అన్నారు. బుధవారం ఆమె హాత్ సే హాత్ జోడో అభియాన్ లో భాగంగా మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ మున్సిపాలిటీలోని 16వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ సుస్థిర పాలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని తెలిపారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by