DIGITAL MANCHERIAL NEWS:- తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రివర్యులు KCR, బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సమక్షంలో కన్నెపల్లి మండలం జనకాపూర్ గ్రామ పంచాయతీ ఎల్లారం గ్రామం నుండి సుమారు 100 మంది కాంగ్రెస్, BJP మరియు ఇతర పార్టీల నుండి నాయకులు, కార్యకర్తలు BRS పార్టీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి తాము బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి AMC చైర్మన్ నిరంజన్, స్థానిక ఎంపీటీసీ లత-శంకరయ్య, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు శ్రీరామరావు, ఇతర ప్రజాప్రతినిధులు, BRS నాయకులు ఉదయ్, ప్రశాంత్, వినయ్, తదితరులు పాల్గొన్నారు.

