DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ పట్టణ అభివృద్ధికి సహకరించాలని, ఎండాకాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ శ్వేత-శ్రీధర్, కౌన్సిలర్స్ రాయలింగు, రమేష్, ఇతర ప్రజాప్రతినిధులు, BRS పార్టీ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, కమిషనర్ వెంకటేష్, AE సందీప్, TO ఆశ్రిద్, తదితరులు పాల్గొన్నారు.

