యువత చదివి, అభివృద్ధి మార్గం వైపు అడుగులు వేయాలి: పోలీస్ కమిషనర్.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- రామగుండం పోలీస్ కమిషనరేట్ లోని మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్లి నగర్ గ్రామంలో జన్నారం పోలీస్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా పోలీస్ మీకోసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపీఎస్. మంచిర్యాల డీసీపీ సుధీర్ రామనాథ్ కేకన్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారిని గ్రామస్తులు సంప్రదాయా నృత్యం, డప్పు చప్పుళ్ల నడుమ గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజేశ్వరి మాట్లాడుతూ... కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా పోలీస్ మీ కోసం కార్యక్రమం సందర్బంగా ఈ రోజు మారు మూల గ్రామలైన అల్లి నగర్, దొంగపల్లి, మల్యాల, బొమ్మేనా, పైడి పల్లి గ్రామం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల మంచి కోసం పోలీస్ శాఖ తరుపున ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు పోలీస్ మీ కోసం కార్యక్రమం ద్వారా ఇక్కడికి రావడం జరిగింది అని తెలిపారు. అలాగేేే ఈ గ్రామంలో  చాలా మంది చదువుకొనే యువతీ, యువకులు ఉన్నారు. మంచిగా చదువు చదువుకొని, ప్రభుత్వం ఉద్యోగం లేదా ఏదైనా మంచి ప్రవేట్ ఉద్యోగం సాధించడానికి పోలీస్ తరుపున మీకు కావలసిన సహాయ, సహకారం అందిస్తామని ఉపాధికి సంబంధించి ఎటువంటి వాటిలోనైనా రాణించి సమాజంలో తమ గ్రామం అభివృద్ధి వైపు పయనించేలా కృషి చేయాలని సీపీ తెలిపారు. ఈ ప్రాంతం లోని పిల్లలు పెద్ద స్థాయిలో బయటికి వెళ్లాలి మంచి ఉద్యోగంతో ముందుకు ఎదగాలి అన్నారు. ఊరిలో ఉన్నటువంటి ముఖ్యంగా యూత్ పిల్లలు చదువుతున్నారు వాళ్ళందరికీ కూడా మా పోలీస్ అధికారులు అందుబాటులో ఉంటారు ఉద్యోగ పరంగా వాళ్ళకి కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ చదువుకోవడానికి వాళ్ళకి అవసరం ఉన్నటు వంటి సహాయం చేస్తాం. కోచింగ్ సెంటర్ లో జాయిన్ చేయించడం వాళ్లకి కోచింగ్ మెటీరియల్ తెప్పించడం ఇవ్వడం జరుగుతుంది. పోలీస్ తరుపున మీకేం కావాలో తెలియచేయాలనీ తెలిపారు. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మమ్మల్ని మీరందరూ కూడా ఒక కుటుంబ సభ్యులుగా చూసుకొని మీకు అవసరం ఉన్నటువంటి సహాయం కొరకు మమ్మల్ని అడగాలి అన్నారు. మంచి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగం సాదించాలి . మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం తరుపున చాలా పథకాలు అమలు చేస్తున్నదని వాటిని సద్వినియోగం చేసుకోవాలి అని తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే పోలీస్ అధికారుల దృష్టి కి తీసుకువస్తే సంబందించిన ప్రభుత్వ శాఖల వారి తో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం అన్నారు. గ్రామంలోని 300 మంది మహిళలకు చీరలను, యువకులకు వాలీ బాల్ కిట్స్ అందచేయడం జరిగింది. వారందరికీ భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ స్కూల్ కి వెళ్లే చిన్న పిల్లలకు షూస్, చెప్పులు లేకుండా ఉండడం గమనించిన సీపీ రాజేశ్వరి రెండు రోజులలో వారికి షూస్, చెప్పులు పంపిస్తానని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసిపి తిరుపతి రెడ్డి, లక్షేట్టిపేట సీఐ కృష్ణ రెడ్డి, జన్నారం ఎస్సై సతీష్ , సర్పంచ్, ఎంపిపి, గ్రామ పటేల్, ప్రజా ప్రతినిధులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by