DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల నియోజకవర్గంలోని లక్షెటపేట పట్టణంలోని పోషణ పక్షంలో భాగంగా సత్య సాయి నగర్ లోని ఉత్కూర్- 3 అంగన్వాడి సెంటర్లో స్వయం సహాయక సంఘాలతో ముఖ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సూపర్వైజర్ దీపావహిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ముఖ్యంగా చిరుధాన్యాలు, తృణధాన్యాలు, సిరి ధాన్యా లపై మరియు రక్తహీనత గురించి వివరించడం జరిగింది. ముఖ్యంగా గర్భిణీలు ప్రాథమిక దశనుండే జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్కూర్- 3 అంగన్వాడి సెంటర్ టీచర్ పి.జ్యోతి, సమీప పాఠశాల టీచర్ కె. విద్యరాణి, వివిధ అంగన్వాడి సెంటర్ల టీచర్లు ఆండాలు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

