DIGITAL MANCHERIAL NEWS:- ఇటీవల జరిగిన ఫోన్ వాట్సప్ చాటింగ్ అదంతా కావాలని కొందరు రాజకీయంగా ఎదురుకొనలేక ఎమ్మెల్యే మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఆ వార్తల్లో వాస్తవం లేదని నేతకని మహర్ సంగం నాయకులు జాడి రాజేష్ ఆరోపించారు. బెల్లంపల్లి నియోజకవర్గం లో ఒక దళిత ఎమ్మెల్యే ప్రజల ఆదరణ చూసి ఓర్వలేకనే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. నిత్యం ప్రజల్లో ఉండే ఎమ్మెల్యే చిన్నయ్య. అతని మీద ఈగ వాలిన సహించేది లేదని అన్నారు. అటువంటి నాయకులకు మా యొక్క కులం సంగం తరఫున హెచ్చరించి చెప్పేది ఒక్కటే. మా యొక్క ఎమ్మెల్యే ను ఎదురుకోవాలంటే రాజకీయంగా సామాజికంగా ఎదురుకోవాలి కానీ, అతని వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ అతని మనోవేదనకు గురి చేస్తే మాత్రం గట్టిగానే బుద్ధి చెప్పల్సి వస్తుందని అన్నారు. ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం అవుతే సహించేదే లేదని అన్నారు.

