బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి పట్టణంలో బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో  పట్టణ సమీపంలోని కన్నాల శివాంజనేయ విగ్రహం వద్ద ఆదివారం చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...ట్రస్టు ఆధ్వర్యంలో ఏటా ఈ చల్లటి నీటి పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ రెండున అనగా ఆదివారం మధ్యాహ్నం ఎండ పూట వెదురు తడకలతో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో తాగునీటి పంపిణీని ప్రారంభించారు. అలాగే బాయిజమ్మ సాయి సేవ ట్రస్టు ఏర్పాటయి నాలుగో ఏడాది నడుస్తోంది. ట్రస్టు ఆధ్వర్యంలో నిత్య అన్నదానం కార్యక్రమం తో పాటు మంగళ, గురువారాలలో ప్రత్యేక అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్య పండుగలు, జాతరలు సందర్భాలలో మహా అన్నదాన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. బెల్లంపల్లి పట్టణ తో పాటు పరిసర ఆలయాలలోనూ నీటి పంపిణీ, మజ్జిగ పంపిణీ, అల్పాహారం పంపిణీ, ఆహార పంపిణీ తదితర విస్తృతమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ట్రస్టు ఏర్పాటై నాలుగవ ఏడాదిలో అడుగుపెట్టిన సందర్భంగా వరుసగా నాలుగోసారి కన్నాల శివాంజనేయ విగ్రహం వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఇటు సోమగుడం, కాసిపేట, మందమర్రి, మంచిర్యాల, గోదావరిఖని ప్రాంతాలకు వెళ్లే వారితో పాటు మరోవైపు తాండూరు, రెబ్బెన, కాగజ్నగర్, ఆసిఫాబాద్ వైపు వెళ్లే వారికి దారిలో బెల్లంపల్లి ఊరు అవతల కన్నాల ప్రాంతంలో మధ్యాహ్నం సమయంలో తాగునీటికి ఇబ్బంది కాకుండా బాయిజమ్మ సాయి సేవా ట్రస్టు వారు చలివేంద్రం ఏర్పాటు చేయగా ఇది వచ్చిపోయే ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని పలువురు ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి, సభ్యులు డీ. మధుకర్, త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షర్, మేనేజర్ బొద్దున సతీష్, సేవకులు, ఏనుగు హేమలత , వెంకటేష్, ప్రశాంత్ ప్రధాన అర్చకులు వేణుగోపాల శర్మ, ప్రయాణికులు పాల్గొన్నారు.





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by