నేతకాని మహార్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని సన్మానించిన ఎమ్మెల్యే.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న డాక్టర్ B. R. అంబేద్కర్ జయంతి ( ఏప్రిల్ 14, 2023 ) మరియు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి ( ఏప్రిల్ 5, 2023 ) వేడుకల రాష్ట్ర కమిటీ వైస్ చైర్మన్ గా నియమించబడిన మంచిర్యాల జిల్లా నేతకాని ముద్దుబిడ్డ, తెలంగాణ నేతకాని మహార్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం రాజేష్ ను ఆదివారం ఘనంగా సన్మానించి, అభినందించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నేతకాని కులాన్ని మరొక్కసారి గుర్తించి, ఈ జయంతుల వేడుకల రాష్ట్ర కమిటీలో వైస్ చైర్మన్ గా మన నేతకాని ముద్దుబిడ్డ దుర్గం రాజేష్ కి చోటు కల్పించినందున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు KCR కి, అందుకు సహకరించిన తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల డెవలప్మెంట్ శాఖామాత్యులు కొప్పుల ఈశ్వర్ తెలంగాణ రాష్ట్ర నేతకాని సమాజం తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్, నేతకాని సంఘం నాయకులు కలాలి నర్సయ్య, గోమాస రాజం, దుర్గం గోపాల్, దుర్గం నర్సయ్య, గోళ్ళ రాజమల్లు, సునార్కార్ రాంబాబు, కలాలి భీమయ్య, రత్నం ప్రకాష్, దుర్గం భానుపసాద్, దుర్గం శ్రీనివాస్, శేఖర్, రత్నం రాయలింగు, జాడి రాంచందర్, జమ్మిడి విశ్వనాథ్, దుర్గం ప్రభాకర్, DS నేత, యువరాజ్, గొర్లపల్లి విజయ్, వెంకటేష్, గోమాస తిరుపతి, దుర్గం రాంచందర్, రాంటెంకి కార్తీక్, బోర్లకుంట రాజేష్, రత్నం ప్రశాంత్, గోమాస క్రాంతి, రత్నం ప్రణయ్, దుర్గం రవి, గోలేటి లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by