DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో గుండెపోటుతో మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు శనివారం గుండెపోటుతో మృతి చెందారు. తనతో పని చేస్తున్న ఇతర ఉద్యోగులు తెలిపిన వివరాల ప్రకారం... విధులు నిర్వహిస్తుండగా క్యాంపు లోనే మృతి చెందినట్లు తెలిపారు.

