DIGITAL MANCHERIAL NEWS:- నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకల సందర్భంగా లక్షెట్టిపేట పట్టణంలోని కరీంనగర్ చౌరస్తా లో వున్న ఎన్టీఆర్ విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ నల్మస్ కాంతయ్య పూలమాల వేసి నివాళ్ళు అర్పించినారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.... తెలుగు ప్రేక్షకుల, ప్రజల గుండెల్లో నందమూరి తారక రామారావు సృష్టించుకున్న స్థానం సుస్థిరమైనది. తెలుగు భాషపై.. తెలుగు నేలపై ఆయన ముద్ర అజరామరం. అందుకే ఆయన తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు అని అన్నారు.. సినిమా రంగమైనా.. రాజకీయ వేదిక అయినా.. అన్ని చోట్ల కోట్లాది మంది మనసులో నిలిచిపోయిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు. ఎన్నేళ్లయినా.. ఎన్నాళ్లైనా ఆ మహానుభావుడుని తెలుగు జాతి మరువలేనిదని అన్నారు.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎండి. ఆరిఫ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నడిమెట్ల రాజన్న, రాందేని తిరుపతి, గడి కొప్పుల సతీష్, బాణాల రమేష్, జయంతి నిర్వాహకులు యార్లగడ్డ గంగాధర్ రావు, కౌన్సిలర్ శ్రీకాంత్, ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

