DIGITAL MANCHERIAL NEWS:- తెలంగాణ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ సెట్ ఫలితాలు విడుదలయ్యాయని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సి ఓ ఈ ప్రిన్సిపల్ ఐనాల సైదులు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ,బీసీ, జనరల్ గురుకులాల్లో వచ్చే విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించిన టి.జి.సెట్ - 2023 ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. పరీక్ష రాసిన విద్యార్థులు https://tgcet.cgg.gov.in/TSVTGCETAPPLSPR/tgcet0405am14122023.results వెబ్సైట్ లో ఫలితాలు చూసుకొని సీటు వచ్చినవారు వెంటనే సంబంధిత సర్టిఫికెట్లతో గురుకులంలో అడ్మిషన్ పొందాలని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఐనాల సైదులు సూచించారు.

