DIGITAL MANCHERIAL NEWS:- పదవ తరగతి పరీక్షల్లో 10 జీపీఏ సాధించిన తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సిఓఈ) బెల్లంపల్లి విద్యార్థి కొండగొర్ల సిద్ధార్థ ను మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్ ఘనంగా సన్మానించారు. అంతే కాకుండా అడిషనల్ కలెక్టర్ స్వయంగా వ్రాసిన ప్రత్యేక ప్రశంస పత్రం సిద్దార్ధకు అందజేసారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించడమే కాకుండా విద్యార్థులను పలు రంగాల్లో తీర్చిదిద్దుతున్న బెల్లంపల్లి సీఓఈ సిబ్బందిని ప్రిన్సిపాల్ ఐనాల సైదులు ను అడిషనల్ కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాకుండా గురుకులాల్లో జరుగుతున్న ప్రత్యేక ప్రణాళిక మరియు కార్యాచరణ గురించి అడిగి తెలుసుకున్నారు. బెల్లంపల్లి సి ఓ ఈ లో జరుగుతున్న ఐ.ఐ.టి, నీట్ శిక్షణ పొందుతున్న విద్యార్థులను త్వరలో కలిసి మాట్లాడతానని అడిషనల్ కలెక్టర్ తెలిపారు. ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిన సిద్ధార్థ ను కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించడం ఇతర విద్యార్థులకు స్ఫూర్తినిస్తుందని అదిలాబాద్ రీజియన్ రీజినల్ కో ఆర్డినేటర్ కొప్పుల స్వరూప రాణి తెలిపారు. ఫోన్ ద్వారా విద్యార్థికి సిబ్బందికి ప్రిన్సిపాల్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. సన్మానం అనంతరం చేసి విద్యార్థికి అందజేశారు . 10 జిపిఏ సాధించడంతోపాటు 100% ఫలితాల కోసం అమలు చేసిన ప్రత్యేక ప్రణాళిక తన విజయానికి ఎలా తోడ్పడిందో విద్యార్థి సిద్ధార్థ వివరించాడు . అదేవిధంగా తనను ఎంతో ప్రోత్సహించిన ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ ప్రత్యేక కృషిని తెలియజేశాడు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ యాదయ్య , సైన్స్ ఆఫీసర్ మధుబాబు, వైస్ ప్రిన్సిపల్ కోట రాజ్ కుమార్ , కోటి చింతల మహేశ్వర రావు, సంక్షేమ గురుకులాల జిల్లా సమన్వయాధికారి రామల బాలభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


