వైన్ షాపులో MRP రేట్ల కంటే ఎక్కువ వసూళ్లు...!
May 07, 2023
0
DIGITAL MANCHERIAL NEWS:- కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూర్ మండల కేంద్రంలోని జై హనుమాన్ వైన్ షాప్ లో బీర్లకు గాని, ఇతర ఫుల్ బాటిళ్లకు కానీ... ఎమ్మార్పీ రేట్ల కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదేంటంటూ వైన్ షాప్ నిర్వాహకులను నిలదీయడంతో మాకు చాలా వరకు ఖర్చులు ఉంటాయని మేము ఇలానే ఎక్కువ మొత్తంలో తీసుకుంటామని మీరేం చేస్తారో చేసుకోండి అంటూ సమాధానం ఇస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి... వైన్ షాప్ నిర్వాహకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

