లైంగిక వేధింపులు జరగలేదు: కేటీఆర్.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై వచ్చిన ఆరోపణలపై మంగళవారం ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. యాంకర్ మీరు షేజల్ వ్యవహారంపై ఎలా స్పందిస్తారు అని కేటీఆర్ ని అడగగా... దీనిపై మంత్రి స్పందిస్తూ ఢిల్లీలో తమ ఎంపీలు షేజల్తో మాట్లాడారని ఆమె విషయం మొత్తం తమ ఎంపీలకు చెప్పిందని, అందులో లైంగిక వేధింపులలాంటివి ఏమీ లేవని ఆయన కొట్టిపారేశారు. కావాలంటే ఈ విషయంపై మీరే తెలుసుకోండని యాంకర్ కు సమాధానం ఇచ్చారు. మాటలు, అడ్డగోలు ఆరోపణలు చేయడం కంటే... ఆధారాలతో ఎవరైనా దొరికితే పార్టీ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని ఆ ఛానల్ ఇంటర్వ్యూలో కేటీఆర్ వ్యాఖ్యానించారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by