DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని లక్సెట్టిపేట్ మండలంలో మద్యానికి బానిసైనా యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... లక్సెట్టిపేట్ మునిసిపాలిటీ పరిధిలోని శ్రీ సత్యసాయి నగర్ కి చెందిన రాథోడ్ శివసాయి (16) అనే యువకుడు మద్యానికి బానిసై ఇంట్లో వాళ్లు మద్యం మానుకోమని చెప్పినప్పటికి చాలా సార్లు మందలించిన కూడా మద్యం సేవించడం మానుకోలేదు. అంతే కాకుండా మద్యం అలవాటు మానుకోమని చెబితే ఆత్మహత్య చేసుకుని చనిపోతానని బెదిరించేవాడు. గతంలో మద్యం మానుకోమని కుటుంబ సభ్యులు చెబితే ఇంట్లో ఉన్న ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు పాల్పడగా ఆసుపత్రికి తరలించి బ్రతికించుకున్నారు. అదే క్రమంలో మంగళవారం రాత్రి కూడా అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఇంట్లో కుటుంబ సభ్యులు మానుకోమని చెప్పగా మనస్థాపం చెంది అందరు పడుకున్న తర్వాత బుధవారం ఉదయం సీలింగ్ ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని తండ్రి రాథోడ్ రాంసింగ్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై లక్ష్మణ్ తెలిపారు.

