DIGITAL MANCHERIAL NEWS:- తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం బెల్లంపల్లి మండలంలోని లంబడి తండ గ్రామంలో తెలంగాణ అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాయమల్లు, పంచాయతీ సెక్రెటరీ శిరీష ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సాధనకై అసువులు బాసిన అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.... సుదీర్ఘ పోరాటం, అమరవీరుల బలిదానాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

