తాత్కాలిక బోధనా సిబ్బంది భర్తీ కై ఆహ్వానం.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన చేసేందుకు తాత్కాలిక బోధన సిబ్బంది ఎంపిక ఈ నెల 28 న జరుగుతుందని ప్రాంతీయ సమన్వయాదికారి కొప్పుల స్వరూపారాణి ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సిఓఈ బెల్లంపల్లి లో ఉదయం 9 గం.ల నుండి ఒరిజినల్ దృవ పత్రాల పరిశీలన అనంతరం “తరగతిగది బోధన పరిశీలన (డెమో)" నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. 

-ఖాళీ పోస్టుల వివరాలు:-


*బాలుర గురుకులాల్లో:-


a). జూనియర్ లెక్చరర్స్:


తెలుగు-01, ఇంగ్లిష్-01 అండ్ కెమిస్త్రి-01.


b). పిజిటి:- 


హింది-01, ఇంగ్లిష్-04, మాథ్స్ -02,పిజికల్ సైన్స్-01,బయాలజికల్ సైన్స్-01, సోషల్-02,  


c). టిజిటి: 


మాథ్స్-01, హింది-01 బయాలజికల్ సైన్స్ 01.


*బాలికల గురుకులాల్లో:-

   

a). జూనియర్ లెక్చరర్స్: 


ఇంగ్లిష్-03, మాథ్స్ -01, బోటని -01, జువాలజీ-02, కెమిస్త్రి-01, ఏకనమిక్స్-01. 


b). పిజిటి:- ఇంగ్లిష్ -01, సోషల్-02


c). టిజిటి: హింది-01.

విద్యార్హతలు: జూనియర్ లెక్చరర్ మరియు పిజిటి పోస్టులకు యుజిసి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 50% మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పి.జి. డిగ్రీ తో పాటు బి.ఇడి ఉండలి. అదేవిదంగా టిజిటి పోస్టుకు యు జి సి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి B.Sc / BA/ B.Com డిగ్రీ కనీసం 50% మార్కులతో పాటు, బి.ఇడి అర్హత కలిగి ఉండాలి. 

వేతనం అధ్యాపకులకు రూ 23400/- పిజిటి/టిజిటి లకు రూ 18,200/- ఉంటుందన్నారు.

ఆసక్తి గల అభ్యర్థులు తమ పూర్తి బయోడేటా మరియు తమ విద్యార్హతల జిరాక్స్ కాపీలను దృవ పత్రాల పరిశీలన కొరకు తీసుకొని రావలని సూచించారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by