కాసిపేట 2 గని లో ఘనంగా అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలు. మ్యాన్ రైడింగ్ పనులు మొదలు.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని కాసిపేట 2 గని లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన గని కార్మికులు, అధికారులు. ఈ సందర్భంగా కాసిపేట గ్రూప్ ఏజెంట్ రాజేందర్ మాట్లాడుతూ...యోగా అనేది మారుతున్న మనస్సు యొక్క స్థితిని నిశ్చలంగా ఉంచడం. మన మనస్సును, ఆత్మను, శరీరాన్ని ఏకం చేసే ప్రక్రియ సాధనయే యోగా అని తెలిపారు. అలాగే అని ప్రతి ఒక్క కార్మికులు ప్రతి రోజు ఒక 30 నిమిషాలు యోగా చేయడం వల్ల మానసిక ఒత్తిడి ని అధిగమించి ఆరోగ్యం గా ఉండొచ్చు అని కార్మికులకు తెలియజేశారు. అలాగే అలాగే గని లో మ్యాన్ రైడింగ్ పనులు ప్రారంభించారు ఈ యొక్క పనులను గని మేనేజర్ లక్ష్మీనారాయణ కోబ్బరికాయ కోట్టి మ్యాన్ రైడింగ్ పనులు ప్రారంభించారు. అనంతరం గని మేనేజర్ లక్ష్మీనారాయణ... మాట్లాడుతూ 5 నెలలో మ్యాన్ రైడింగ్ పనులు పూర్తి చేసి గని ఉత్పత్తి ని ఇంకా పెంచి మందమర్రి ఏరియా లోనే కాసిపేట 2 గని నిసెప్టీతో కూడిన ఉత్పత్తి లో ముందంజలో ఉంచుతానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాసిపేట గ్రూప్ ఏజెంట్ రాజేందర్, గని మేనేజర్ లక్ష్మీనారాయణ, సెఫ్టీ ఆఫీసర్ సంతోష్ రావు, ఇంజనీర్ రఘు, కాసిపేట 2 టిబిజికెయస్ ఫిట్ సెక్రటరీ కారుకురి తిరుపతి, వెల్ఫేర్ ఆఫీసర్ భార్గవ్, అండర్ మేనేజర్ శ్యాంసుందర్, సర్వేయర్ ప్రకాశ్, కోత్తపల్లి శంకరయ్య, ఏఐటుయుసి మైన్ కమిటీ మెంబర్ రాజకోమురయ్య, మరియు కార్మికులు గని మైనింగ్ స్టాఫ్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గోనడం పాల్గొన్నారు






Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by