DIGITAL MANCHERIAL NEWS:- కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణి మండలంలో పెద్దపులి కదలికలు కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే... సోమవారం తిర్యాణి మండలంలో పంగిడి మాధర మందగూడ శివారులో లేగదూడ పై పెద్దపులి దాడి చేయడంతో లేగదూడ కూడా అక్కడికక్కడే మరణించింది. సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని లేగదూడ మృతిని అటవి శాఖ అధికారులు నిర్దారించనున్నారు. తిర్యాని మండలంలో పెద్దపులి సంచరించడంతో చుట్టుపక్కల ప్రజలందరూ భయాందోళనతో ఆందోళన చెందుతున్నారు.

