ఫ్లాష్ న్యూస్:- ఆవుపై పెద్ద పులి పంజా... ఆవు అక్కడికక్కడే మృతి...!

D Prashanth Netha
0
DIGITAL MANCHERIAL NEWS:- పెద్దపులి దాడిలో ఆవు మృతి చెందిన సంఘటన కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

 వివరాల్లోకి వెళితే.... బెజ్జూర్ మండలంలోని ఎలుక పల్లి గ్రామానికి చెందిన మొర్ల బాపు అనే రైతుకు చెందిన ఆవు మంగళవారం మేత కోసం అడవికి వెళ్ళింది. మేతమేస్తున్న ఆవుపై పెద్దపులి ఒకేసారి దాడి చేయడంతో ఆవు అక్కడికక్కడే మృతి చెందినట్లు పశువుల కాపరి తెలియజేశాడు. ఆవు పై దాడి చేసిన పెద్దపులి గురించి అటవీ శాఖ అధికారులకు గ్రామ ప్రజలు సమాచారం అందించారు. ఆవుపై పెద్దపులి దాడి చేయడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by