సీఎం ఆర్ ఎఫ్ చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే.

D Prashanth Netha
0
DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి మండలం లోని పేర్కపల్లి గ్రామానికి చెందిన వరలక్ష్మి కి మంజూరు అయిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును సోమవారం బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పంపిణీ చేశారు.



ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఎంతో ఆసరాగా ఉపయోగపడుతుందని, తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి పథకాలే మళ్లీ రానున్న ఎలక్షన్లలో బిఆర్ఎస్ పార్టీ గెలుపుకు నాంది పలుకుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, బెల్లంపల్లి మండల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by