ఫ్లాష్ న్యూస్: సాయిబాబా ఆలయంలో చోరీ...!

D Prashanth Netha
0
DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి మండలంలోని సాయిబాబా ఆలయంలో దొంగతనం. వివరాల్లోకి వెళితే...


బెల్లంపల్లి మండలంలోని బోధ గెస్ట్ హౌస్ సమీపంలోని సాయిబాబా దేవాలయంలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. ఆలయ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించడంతో.. తాళ్లగురజాల ఎస్సై నరేష్ సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన డాగ్స్ స్క్వాడ్ తో పరిసరాలన్నీ సోదా చేశారు. ఆలయంలో జరిగిన చోరీలో రూ.50వేల విలువైన వెండి విగ్రహం, 25 కిలోల పంచలోహ ఉత్సవ విగ్రహం, హుండీ పోయినట్లు ఆలయ నిర్వహకులు పోలీసులకు తెలిపారు. తాళ్ల గురజాల ఎస్సై నరేష్ తో పాటు వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ శంకరయ్య, టూ టౌన్ ఎస్సై రవికుమార్ లతో కలిసి ఆలయ పరిసరాలను పరిశీలించి చోరీపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by