బ్రేకింగ్ న్యూస్:-తండ్రి మందలించడంతో కొడుకు ఆత్మహత్య...!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- తన కొడుకుకు తండ్రి మద్యం తాగవద్దని మందలించడంతో మనస్థాపం చెంది కొడుకు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది.



వివరాల్లోకి వెళితే... బేల మండలంలోని చప్రాలకు చెందిన సచిన్(25) మద్యానికి బానిసై, విపరీతంగా మందు తాగడంతో మందు తాగవద్దని తండ్రి మందలించడంతో మనస్థాపానికి గురై... సచిన్ ఇంట్లో నుండి బయటకు వెళ్లి దీపాయిగూడ ఎక్స్ రోడ్డు సమీపంలో పురుగుల మందు తాగడంతో చూసిన స్థానికులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో... సంఘటన స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చూసిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by