DIGITAL MANCHERIAL NEWS:- భీమిని మండలంలో గండ్ల సాయికిరణ్ యువకుడు మానవత్వం చాటుకున్నాడు.
వివరాల్లోకి వెళితే... వీగాం గ్రామంలో ప్రజలు చెత్తను బయట పడేస్తున్నారని చూసి గ్రామంలోని ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని చెత్తను బయట పడేయవద్దని అదే గ్రామానికి చెందిన గండ్ల సాయి కిరణ్ అనే యువకుడు తన సొంత ఖర్చులతో గ్రామంలో పలుచోట్ల చెత్త వేయడానికి కుండీలను ఏర్పాటు చేశాడు. ఆయన చేసిన మంచి పనికి గాను గ్రామస్తుల ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.




