DIGITAL MANCHERIAL NEWS:- తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీలో చేరికలు జోరందుకున్నాయి. ఇప్పటికే ఇతర పార్టీల నుంచి అనేక మంది కమలం పార్టీలో చేరుతుండగా తాజాగా ఆదిలాబాద్ సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు సంజీవరావు, శ్రీదేవి కాషాయికండువా కప్పుకున్నారు.
సోమవారం ఉదయం చెన్నూరు మాజీ ఎమ్మెల్యే సంజీవరావు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి బీజేపీలో చేరారు. ఇరువురు నేతలకు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డీకే అరుణ , ఈటల రాజేందర్ , వివేక్ , బూర నర్సయ్య గౌడ్, మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సీనియర్లు సంజీవరావు, శ్రీదేవి సేవలను పార్టీ ఉపయోగించుకుంటుందని తెలిపారు. సమిష్టి నాయకత్వంతో బీఆర్ఎస్ ఓడించి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంత ప్రజలను ఆదుకోవటంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.900 కోట్ల పైచిలుకు కేంద్రం నిధులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గరున్నాయన్నారు. నేటి నుంచి కేంద్ర బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తాయని తెలిపారు. అతి తక్కువ సమయంలో కేంద్ర బృందాన్ని మోదీ , షా లు తెలంగాణకు పంపించారని తెలిపారు. గిరిజన రిజర్వేషన్లపై ఎంపీ సోయం బాపూరావు కామెంట్స్ ఆయన వ్యకగతమని చెప్పుకొచ్చారు. సోయం బాపూరావు వ్యాఖ్యలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. సోయం బాపూరావు వ్యాఖ్యలపై పార్టీ వివరణ కోరుతోందన్నారు.

