DIGITAL MANCHERIAL NEWS:- చెన్నూరు మండలంలో కట్టుకున్న భార్యను నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో నరికి హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే... మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రామంలో కట్టుకున్న భార్యను హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. కిష్టంపేట గ్రామంలో గురువారం తెల్లవారుజామున తన భార్య గాలిపెల్లి శంకరమ్మ (45) నిద్రిస్తున్న సమయంలో భర్త గాలిపెల్లి పోశం (50) గొడ్డలితో నరికి హత్య చేసి పరారయ్యాడు. ఎందుకు హత్య చేశాడు అని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

