ఫ్లాష్ న్యూస్:- మద్యం మత్తులో రైతును ఢీ కొట్టిన వ్యాన్... రైతు మృతి.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:-  డ్రైవర్ మత్తుకి తోడు అతివేగంగా వాహనాన్ని నడిపి ఓ రైతు మృతికి కారణమయ్యాడు.



వివరాల్లోకి వెళితే... నిర్మల్‌ జిల్లా లక్ష్మణచాంద మండలం రాచాపూర్‌ గ్రామానికి చెందిన జడ రాజేశ్వర్‌ (60) బుధవారం తెల్లవారుజామున తన వ్యవసాయ తోటకు నడుచుకుంటూ వెళుతున్నాడు. అదే సమయంలో లక్ష్మణచాంద నుంచి నిర్మల్‌ వైపు వెళ్తున్న ఓ వ్యాన్‌ రాజేశ్వర్‌ను ఢీకొట్టింది. ప్రమాద ధాటికి వాహన చక్రంలో రాజేశ్వర్‌ కాలు ఇరుక్కుపోయినా, డ్రైవర్‌ రాజేశ్‌ బండిని ఆపకుండా కొంత దూరం అలాగే ఈడ్చుకెళ్లాడు. స్థానికులు గమనించి పెద్దగా కేకలు వేయడంతో వాహనం ఆపాడు. తీవ్ర గాయాలపాలైన రాజేశ్వర్‌ను నిర్మల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. డ్రైవర్‌ అతి వేగానికి తోడు మద్యం మత్తే ప్రమాదానికి కారణమని స్థానికులు చెప్పారు. యాక్సిడెంట్‌కు కారణమైన డ్రైవర్‌ నరేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by