పోడు భూములకు పట్టాలు పంపిణీ చేసిన విప్.

D Prashanth Netha
0
DIGITAL MANCHERIAL NEWS:- చెన్నూరు నియోజకవర్గం పరిధిలోని గిరిజనులకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ పోడు భూముల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 666 మంది గిరిజనులకు 1, 190 ఎకరాలకు పోడు భూముల పట్టాలను అందజేశారు. 


అనంతరం ఆయన మాట్లాడుతూ... తొమ్మిదేండ్ల ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన గిరిజన సంక్షేమానికి ఒక స్వర్ణయుగం అన్నారు. దశాబ్దాలుగా అడవి తల్లి బిడ్డలు గుట్టలను చదును చేసి పోడు భూములను సాగు భూములుగా మలుచుకున్నారని పేర్కొన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని గత ప్రభుత్వాలకు మొరపెట్టుకున్న హక్కులు దక్కలేదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా 1, 51, 146 మంది పోడు రైతులకు పట్టాలు అందజేసి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో పెద్దపెల్లి పార్లమెంట్ సభ్యుడు బోర్లకుంట వెంకటేష్ నేత, మంచిర్యాల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్, ఇతర బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.






Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by