ప్రజావాణి ద్వారా ప్రజల సమస్యలు పరిష్కారం.

D Prashanth Netha
0
DIGITAL MANCHERIAL NEWS:- ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు సంబంధిత అధికారుల సమన్వయంతో కృషి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు.



మంచిర్యాల కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును పరిశీలించి పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్, ట్రైనీ కలెక్టర్ గౌతమి, జెడ్పీ సీఈఓ నరేందర్, బెల్లంపల్లి ఆర్డీఓ శ్యామల దేవి, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by