DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల ఐడిఓసి కలెక్టరేట్ కార్యాలయంలో చెన్నూర్ నియోజకవర్గం లోని మిషన్ భగీరథ పనులపై జిల్లా కలెక్టర్ బధావత్ సంతోష్, మిషన్ భగీరథ ENC కృపాకర్ రెడ్డి & అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రభుత్వ విప్ & చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలకు నీటిలో ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను సూచించాడు.
- దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలోని 12,769 గ్రామాలకు సురక్షిత మంచినీరు అందిస్తున్న గొప్ప పథకం మిషన్ మిషన్ భగీరథ.
- ఐక్యరాజ్యసమితితో పాటు పలు విదేశీ సంస్థలు ఈ పథకాన్ని ప్రశంసించాయి.
- నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలోని 102 గ్రామపంచాయతీలు, మూడు మున్సిపాలిటీల పరిధిలోని 64 వార్డుల వారీగా మిషన్ భగీరథ, గ్రిడ్ పనులపై సమీక్షించారు.
- ఆగస్టు 15 లోపు పెండింగ్ పనులను పూర్తి చేయాలి. అధికారులు ఒక రోడ్ మ్యాప్ నిర్దేశించుకుని ముందుకు సాగాలి.
- నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు 283 ట్యాంకుల నిర్మాణం పూర్తి చేసి 67,163 గృహలకు 2,62,000 ప్రజలకు త్రాగు నీరు అందిస్తున్నాం.
- వానా కాలం దృష్ట్యా ప్రజలకు అసౌకర్యం కలవకుండా పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు.
- నియోజకవర్గంలోని అన్ని హ్యాబిటేషన్సకి మంచినీటి సరఫరా జరగాలని అధికారులను ఆదేశించారు.
- ప్రజలకు త్రాగునీరు అందించే విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించబోమని కాంట్రాక్టర్లను, ఏజెన్సీ అధికారులను హెచ్చరించారు.
- అవసరమైతే పనిచేయని కాంట్రాక్టర్ లను తొలగించి కొత్తవారిని నియమించి పనులను వేగవంతం చేయాలన్నారు.
- ఇప్పటికే పూర్తయిన గ్రామాల్లో జరుగుతున్న నీటి సరఫరాలో లీకేజీలు గాని, డ్యామేజ్ లు గాని ఉంటే వెంటనే మరమ్మతు చేయాలన్నారు.
- మిషన్ భగీరథ పనుల వల్ల దెబ్బతిన్న రోడ్లను వెంటనే నిర్మించాలి.
- వార్డు, గ్రామ, మండల, మున్సిపల్ స్థాయిలో ప్రజా ప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ త్రాగు నీటి సరఫరాలో ఎలాంటి అవాంతరాలు ఎదురైనా అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాలి.
- అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించాలి.
- ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి పనులు మరింత వేగంగా జరిగేలా చూడాలి.
- మిషన్ భగీరథ ఇంట్రా పనులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా తమ దృష్టికి తీసుకువస్తే పై అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరిస్తాం.
-ఈ సందర్భంగా ENC కృపాకర్ రెడ్డి మాట్లాడుతూ... ప్రజలకు ఆరోగ్యపరంగా సురక్షిత మంచినీరు అందించడానికి నిర్దేశించిన ప్రణాళికతో మంచినీటి సరఫరా చేస్తున్నాం.
- సురక్షిత మంచినీటి అందించే విధానాన్ని తమ తమ గ్రామాల వద్ద ఏర్పాటు చేసిన ఫిల్టర్ బెడ్ వద్ద ప్రజలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవచ్చు.
- మిషన్ భగీరథ పనులు పూర్తి చేయడంతో పాటు వాటి నిర్వహణ బాధ్యత కూడా మేమే చూసుకుంటున్నాము.
- ప్రతి మూడు నెలలకు ఒకసారి నియోజకవర్గాల వారిగా ప్రజల నుండి సమాచారం సేకరించుకుంటున్నాం.
- ఎక్కడ ఏ సమస్య తలెత్తిన అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలి.
- గ్రామస్థాయిలో మంచినీటి సరఫరాకు అధికారులతో పాటు గ్రామ వాటర్ మెన్, సెక్రటరీ, సర్పంచ్ సహకారం ఎప్పుడూ ఉండాలి.
- ఏజెన్సీలు పనిచేసిన వెంటనే క్వాలిటీ కంట్రోల్ అధికారులు చెక్ చేసిన అనంతరం బిల్స్ చెల్లిస్తున్నాము పెండింగ్ బిల్స్ లేవు.
- చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి రెండు వారాలకు ఒకసారి నియోజకవర్గ స్థాయి రివ్యూ మీటింగ్ నిర్వహిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో పాల్గొన్న ENC కృపాకర్ రెడ్డి, SE జ్ఞాన్ కుమార్, EE అంజన్ రావు, మధుసూదన్, EE PR ప్రకాష్, AE & DEE లతో పాటు మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రటరీలు, నియోజకవర్గ MPP, ZPTC, సర్పంచులు, మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్, ఏజెన్సీ ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.




