DIGITAL MANCHERIAL NEWS:- భైంసా పట్టణ శివారులోని గడ్డెన్న వాగు ప్రాజెక్టులో ఓ యువకుడి మృతదేహాం లభ్యమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.
భైంసా మండలంలోని గుండెగాం గ్రామానికి చెందిన సూర్యవంశీ బాలాజీ (30) అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి పట్టణంలోని కిసాన్గల్లీలో అద్దెకు ఉంటున్నాడు. అయితే రెండ్రోజుల క్రితం బాలాజీ ఇంట్లో గొడవ పడి వెళ్లిపోయినట్లు తెలిసింది. దీంతో కుటుంబీకులు బంధువులు, స్నేహితుల ఇండ్లలో వెతికినా ఆచూకి దొరకలేదు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు నమోదైంది. శనివారం ప్రాజెక్టు వైపు వెళ్లిన స్థానికులకు మృతదేహం కనిపించగా.. పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు మత్య్సకారుల సహకారంతో మృతదేహాన్ని బయటకు తీయించగా, బాలాజీ మృతదేహాంగా గుర్తించారు. ప్రాజెక్టు వద్ద పంచనామా నిర్వహించి అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు.

