DIGITAL MANCHERIAL NEWS:- జైపూర్ మండలంలోని నర్వ గ్రామంలో గ్రామ సర్పంచ్ దూట రాజ్ కుమార్ గ్రామాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారు.
గ్రామంలో దొంగతనాలు, నేరాల నియంత్రణ కోసం, అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించుటకు గ్రామంలో తన సొంత ఖర్చులతో 6 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అందరితో ప్రశంసలు పొందుతున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగ జైపూర్ ఎస్సై ఉపేందర్ హాజరై ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఒక్క సీసీ కెమెర 100 మంది పోలీసులతో సమానమని అన్నారు. అలాగే మండలంలోని యువత ప్రజలు చెడు అలవాట్లకు దూరంగ ఉండాలని మండలంలోని సర్పంచులు అందరూ రాజ్ కుమార్ ని ఆదర్శంగా తీసుకొని తమ తమ గ్రామాలలో సిసి కెమెరాలు ఏర్పాటుకు ముందుకు రావాలని అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలు సర్పంచ్ రాజ్ కుమార్ కి ఘనంగా సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్స్, గ్రామ ప్రజలు, పోలీసు శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


