DIGITAL MANCHERIAL NEWS:- హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది.
మాదాపూర్ ఎస్ ఓటీ కూకట్ పల్లి పోలీసుల అధ్వర్యంలో 250 కేజీల గంజాయిని సోమవారం స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని విక్రయిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారి వద్ద నుంచి గంజాయితో పాటు 5 సెల్ ఫోన్లు, రెండు ఇన్నోవా వాహనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

