ఉర్దూ ఘర్...మైనార్టీ ఫంక్షన్ హాల్ కు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల నియోజకవర్గంలోని లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల దగ్గర ఆరో వార్డులో మైనార్టీ సంక్షేమ శాఖ గ్రాంట్- ఇన్ -ఎయిడ్ నిధుల నుండి 57.50 లక్షలతో ఉర్దూ ఘర్ మరియు మైనార్టీ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు భూమి పూజ చేశారు.



ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీల అభివృద్ధి లక్ష్యంగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. అలాగే షాది ముబారక్, మైనార్టీ ఫంక్షన్ హాల్స్, మసీదులలో పనిచేసే ఇమామ్లకు మరియు మౌజనులకు నెల నెల గౌరవ వేతనం, తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇలాంటి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. రాబోయే రోజులలో కూడా బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదరించి మరెన్నో సంక్షేమ పథకాల ద్వారా ముస్లిం మైనార్టీలందరూ అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. అలాగే ఈ సందర్భంగా... లక్షెటపేట ముస్లిం మైనార్టీ అధ్యక్షులు మరియు కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ షాహిద్ అలీ మాట్లాడుతూ... ఉర్దూ ఘర్ మరియు మైనార్టీ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి సహాయ, సహకారాలు అందించిన ఎమ్మెల్యే కి లక్షెటిపేట మైనార్టీ సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరి కోసం ఈ మైనార్టీ ఫంక్షన్ హాల్ నిర్మించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.



ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నల్మస్ కాంతయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్, ఆరో వార్డు కౌన్సిలర్ చాతరాజు రాజన్న, పట్టణ అధ్యక్షులు పాదం శ్రీనివాస్, కౌన్సిలర్లు సజ్జు, శ్రీకాంత్, ముస్లిం మైనార్టీ మత పెద్దలు, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by