ఫ్లాష్ న్యూస్:- విధులకు డుమ్మా...వైద్యుడి సస్పెన్షన్.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- విధులకు డుమ్మా కొట్టడంతో వైద్యుడిని సస్పెండ్ చేసిన సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.



వివరాల్లోకి వెళితే... బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయుష్ విభాగం రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ శంకర్ నాయక్ శుక్రవారం రోజు అకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఆయన తనిఖీ చేస్తున్న సమయంలో విధుల్లో ఉండవలసిన డాక్టర్ షంశుజ్జమాన్ విధుల్లో లేకపోవడంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసి, రిజిస్టర్ ను పరిశీలించగా ఆయన మూడు నెలల్లోనూ ఆరు రోజులు మాత్రమే హాజరైనట్లు ఉండడంతో ఆయనను వెంటనే సస్పెండ్ చేశారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by