బ్రేకింగ్ న్యూస్:- చిల్లర చేష్టలతో రెచ్చిపోతున్న మందుబాబులు...!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- రహదారిపై మందుబాబులు విచ్చలవిడిగా మందు తాగి... తాగిన మద్యం సీసాలను కూడా రోడ్లపైనే పగలగొట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.



వివరాల్లోకి వెళితే... నేన్నెల మండలంలోని జెండా వెంకటాపూర్ గ్రామం నుంచి మందమర్రి వైపుగా వెళ్లే రహదారి పై నిర్మించిన బ్రిడ్జిపై...



మందుబాబులు అడ్డాగా చేసుకుని విచ్చలవిడిగా మందు తాగి తాగిన సీసాలను అక్కడే పగలగొడుతున్నారు. ఇలా చేయడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిపై స్థానిక పోలీసులు స్పందించి రాత్రి సమయాలలో తిరిగి మందు బాబులపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా వాహనదారులు కోరుకుంటున్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by