DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల కళాశాలలో 2023౼2024 విద్య సంవత్సరమునకు గాను ఇంటర్ మీడియేట్ మొదటి సంవత్సరంలో మిగిలి ఉన్న ఖాళీల భర్తీ కొరకు ఈ నెల 15 శనివారం రోజున స్పాట్ అడ్మిషన్లు నిర్వహించబడునని తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల సంస్థ ఆదిలాబాద్ రీజినల్ కో ఆర్డినేటర్ కొప్పుల స్వరూప ఒక్క ప్రకటన లో తెలిపారు.
బాలురకు సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల జైపూర్ యందు బాలికలకు లక్షేట్టి పేట సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల యందు నిర్వహించబడునని అర్హత ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 15 శనివారం ఉదయం 10 గంటలకు సంబంధిత కళాశాలాల యందు ఒరిజినల్ సర్టిఫికేట్ తో హాజరు కలవాలని తెలిపారు. అలాగే మార్చి 2023 లో పదవ తరగతి పాస్ అయిన వారు మాత్రమే అర్హులని సప్లిమెంటరీ 2022౼2023 విద్య సంవత్సరం లో ఉత్తీర్ణులయిన వారికి అర్హత లేదని తెలిపారు.

