DIGITAL MANCHERIAL NEWS:- వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం పశ్చిమ వాయువ్యదిశగా కదులుతూ రాగల 3 రోజుల్లో ఉత్తర ఒరిస్సా , ఉత్తర చత్తీస్‌గడ్ మీదుగా వెళ్లే అవకాశం ఉండడంతో అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది.
భారీ వర్షాల కారణంగా 16 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అందులో ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కామారెడ్డి జిల్లాలలో భారీ వర్షాలు కురవనున్నాయి. కాబట్టి ఈ 16 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో ఈ ప్రాంతాల వారు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

