DIGITAL MANCHERIAL NEWS:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహ లక్ష్మీ పథకం దరఖాస్తులు చేసుకోవడానికి ఈ నెల చివరి వరకు గడువు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకంలో భాగంగా కేవలం 3 రోజుల గడువు ఇవ్వడం వలన సమయము చాలా తక్కువ ఉన్నందున ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకము ఇల్లు లేని నిరుపేదలకు అందాలంటే గడువు పొడిగించి మహిళల పేరు మీదనే స్థలం ఉంటే గృహలక్ష్మికి అర్హులని అదేవిధంగా కాకుండా ఇంటి యజమాని ఎవరైనా సరే వారి పేరు మీద స్థలము ఉంటే దరఖాస్తు చేసుకున్నటు వంటి మహిళలకు గృహలక్ష్మి ఇల్లు కట్టుకునే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించాలి. అలాగే కుల ధ్రువ పత్రాలు తీసుకురావాలంటే 10 రోజుల సమయం పడుతుంది కాబట్టి నిరుపేదల సమస్యలను ప్రభుత్వం గుర్తించి గృహలక్ష్మి దరఖాస్తులు చేసుకునే సమయం పెంచాలని ప్రభుత్వాన్ని కొండు బానేష్ కార్యదర్శి రైతు సంఘం (ఏఐకేఎస్) డిమాండ్ చేశారు.

