శిక్షణలో నేర్చుకున్న అంశాలను ఖచ్చితంగా అమలు చేయాలి: కలెక్టర్ కుమార్ దీపక్.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL:- మంచిర్యాల సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికారులకు అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకొని శిక్షణలో నేర్చుకున్న అంశాలను కచ్చితంగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.





శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ప్రత్యేక ఎన్నికల అధికారి శంకర్ తో కలిసి ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులు,సహాయ రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ మాట్లాడుతూ...మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమైనదని, ఎన్నికల ప్రక్రియ నామినేషన్ దశ నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన వరకు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, రిటర్నింగ్ అధికారుల హ్యాండ్‌బుక్ ప్రకారం పారదర్శకంగా, నిబంధనలకు లోబడి విధులు నిర్వహించాలని తెలిపారు. శిక్షణలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పరిపాలనా వ్యవస్థ,పోలింగ్ కేంద్రాల ఏర్పాటు,పోలింగ్ సిబ్బంది నియామకం, విధులు, ఎన్నికల సామగ్రి లభ్యత, పంపిణీ, ఎన్నికల నోటిఫికేషన్ జారీ,ఓటరు జాబితా ప్రదర్శన, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ,ఎన్నికల గుర్తుల కేటాయింపు, ప్రచార కాల పరిమితులు, పోలింగ్ ఏర్పాట్లు,పోలింగ్ రోజు విధులు, బ్యాలెట్ బాక్సుల మూసివేత,ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన, ఎన్నికల ఖర్చుల పరిశీలనపై సమగ్ర అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. నామినేషన్ ప్రక్రియలో పోస్టల్ బ్యాలెట్లు, ఫారం–ఎ,ఫారం–బి,కుల ధృవీకరణ పత్రాలు,డిపాజిట్ రాయితీలు, అభ్యర్థులు సమర్పించవలసిన ఒరిజినల్ పత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలని, నామినేషన్‌కు సంబంధించిన లోపాలు, తిరస్కరణలుఎన్నికల నిబంధనల ప్రకారం స్పష్టంగా చేపట్టాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ కోసం సి.సి.కెమెరాలు ఏర్పాటు చేయాలని,డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించాలని, హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని తెలిపారు. మున్సిపల్ కమిషనర్లతో సమన్వయం పాటిస్తూ చెక్‌లిస్ట్‌ను తప్పనిసరిగా అనుసరించాలని అధికారులకు సూచించారు. పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులు విధులు, బ్యాలెట్ పేపర్లు, ఎన్నికల గుర్తుల కేటాయింపు, అభ్యర్థులు ఫారం–ఎ, ఫారం–బి,ఒరిజినల్ పత్రాలు సమర్పించాల్సిన అంశాలపై వివరించారు.ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా శిక్షణ అందించాలని అధికారులకు సూచించారు.ఎన్నికల నిర్వహణ సమయంలో సైతం సంబంధిత శాఖల పనులు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు.ఆ శిక్షణా కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారులు,రిటర్నింగ్ అధికారులు,సహాయ రిటర్నింగ్ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by