DIGITAL MANCHERIAL:-
- బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో "ఘన"తంత్ర దినోత్సవం.
- జెండా ఎగురవేసిన ప్రిన్సిపాల్ ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్లి శంకర్.
- హాజరైన అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు.
బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో సోమవారం 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్లి శంకర్ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. అనంతరం అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది విద్యార్థులకు మిఠాయిలు అందజేశారు.
--రాజ్యాంగం ద్వారా గొప్ప జీవితం--
- ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు విద్యార్థులను ఉద్దేశించి ప్రిన్సిపాల్ ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్లి శంకర్ మాట్లాడారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని విద్యార్థులకు తెలిపారు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితం ఉన్నత దిశగా సాగిందని.. సాగుతోందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరం రాజ్యాంగ స్ఫూర్తితో మెలగాలని ఆకాంక్షించారు. వైస్ ప్రిన్సిపాల్ మేడ తిరుపతి, ఇతర అధ్యాపకులు కూడా ప్రసంగించారు. ఈ సందర్భంగా వారి మాటలతో పాటు పాటలు కూడా గణతంత్ర దినోత్సవానికి మరింత ఆకర్షణను తెచ్చాయి. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది సీనియర్ అసిస్టెంట్ ఎం. వెంకటేశ్వర్లు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.


