DIGITAL MANCHERIAL NEWS:-
- బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరండి.
- ప్రిన్సిపాల్, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్లి శంకర్.
- ఇంటర్మీడియట్ పూర్తి చేసుకోబోయే విద్యార్థులకు పిలుపు.
- సెకండియర్ పరీక్ష కేంద్రాల వద్ద బోధన సిబ్బందిచే కరపత్రాల పంపిణీ.
-- బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గల ఏకైక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ప్రిన్సిపాల్, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్లి శంకర్ పిలుపునిచ్చారు. కళాశాల అకాడమిక్ కార్యక్రమాలలో భాగంగా 2026-27 విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల కోసం గాను బుధవారం ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు జరుగుతున్న కేంద్రాల వద్ద కళాశాల బోధన సిబ్బందిచే అడ్మిషన్ల కరపత్రాలను పంపిణీ చేశారు. ఇంటర్ సెకండియర్ పరీక్ష పూర్తి చేసుకుని పరీక్ష కేంద్రాల బయటకు వచ్చిన విద్యార్థులతో ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడారు.... అందుబాటులో బిఏ ఆనర్స్ మూడు సంవత్సరాల కోర్సు, బి ఏ .సి బి సి ఎస్ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎకనామిక్స్ హిస్టరీ, బీకాం, బీఎస్సీ కోర్సులు
-- బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బిఎ ఆనర్స్ మూడు సంవత్సరాల కోర్సు బిఎ సి బి సి ఎస్ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ హిస్టరీ ఎకనామిక్స్, బీకాం కంప్యూటర్స్, బీకాం టాక్సేషన్, బీకాం బిఎఫ్ఎస్ఐ, బీఎస్సీ ఎంపీసీ, ఎంపీసీఎస్, బీఎస్సీ బీజెడ్సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని ప్రిన్సిపాల్ తెలిపారు. ఇక్కడ డిగ్రీ పూర్తయిన విద్యార్థులకు పీజీలో కూడా మూడు కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. తమ కళాశాలలో చదివే విద్యార్థులకు బెల్లంపల్లి పట్టణంలో వసతి గృహ సదుపాయం కూడా అందుబాటులో ఉందని వివరించారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకోబోయే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వివరాలకు 9959269975 కి సంప్రదించాలని తెలిపారు


