DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నిక సందర్భంగా జరిగిన ఘర్షణలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కారణమంటూ ఫిబ్రవరి 18 తారీకు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
ఆయనతో పాటు పలువురు బిఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి అదిలాబాద్ జైలుకు పంపించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరోవైపు పోలీసులు సైతం ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని మంచిర్యాల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదోపవదనలు జరిగిన అనంతరం పోలీసుల కస్టడీ పిటిషన్ కోర్టు కొట్టివేసింది. అనంతరం... బాల్క సుమన్కు బెయిల్ మంజూరు చేస్తూ జిల్లా సెషన్స్ జడ్జి తీర్పు చెప్పారు. ఈ సందర్భంగా... బుధవారం ఉదయం ఆయన విడుదల కానున్న నేపథ్యంలో జిల్లా కోర్టుకు భారీ ఎత్తున బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు.

