బ్రేకింగ్ న్యూస్:- క్యాతన్ పల్లి మున్సిపాలిటీ కైవసం చేసుకున్న బిఆర్ఎస్.

D Prashanth Netha
0
DIGITAL MANCHERIAL NEWS:- 

- ఓటింగ్ కు దూరంగా కాంగ్రెస్ కౌన్సిలర్లు.

- ఓటింగ్ కు హాజరైన బిఆర్ఎస్, సిపిఐ కౌన్సిలర్లు. 

- ఓటింగ్ కు హాజరుకాని ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఉన్న  పెద్దపల్లి ఎంపీ వంశీ.

- చెన్నూరు ఎమ్మెల్యే మంత్రి వివేక్ వెంకటస్వామి. 

- క్యాతన్ పల్లి  మున్సిపాలిటీ చైర్ పర్సన్ కైవసం చేసుకున్న బిఆర్ఎస్.

- వైస్ చైర్ పర్సన్ ను కైవసం చేసుకున్న సిపిఐ. 

- చైర్ పర్సన్ గా గోడిసెల సంధ్యారాణి.

- వైస్ చైర్ పర్సన్ గా మిట్టపల్లి సరిత. 



తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంగా మారిన క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఎన్నిక ప్రక్రియ పూర్తి కావడంతో క్యాతన్ పల్లి బిఆర్ఎస్ ఖాతాలోకి వెళ్ళింది. గత రెండు నెలల నుంచి ఇక్కడ జరుగుతున్న పరిణామాల మధ్య చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆయన పట్టు నిలుపుకున్నారు. శనివారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ కోసం జరిగిన ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి సిపిఐ సభ్యులు 14 మంది పాల్గొనగా కాంగ్రెస్ కౌన్సిలర్లు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఉన్న మంత్రి వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి ఎంపీ వంశీలు ఓటింగ్కు హాజరు కాలేదు. న్యాయస్థానం ఆదేశాల మేరకు నిర్వహించిన ఎన్నికలో మున్సిపల్ చైర్మన్ గా సంధ్యారాణి రాజా రమేష్, వైస్ చైర్మన్గా సరిత శ్రీనివాస్ లు గెలుపొందారు. ఎన్నిక సందర్భంగా ఇన్చార్జిగా కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ మరో శాసనసభ్యురాలు కోవా లక్ష్మీ లకు పార్టీ అధిష్టానం బాధ్యత అప్పగించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కోవా లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ లు మాట్లాడుతూ… న్యాయం గెలిచిందన్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా విజయం తమకే దక్కిందన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by