DIGITAL MANCHERIAL NEWS:-
- బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బిఏ ఆనర్స్ కోర్సు.
- డిగ్రీలో ఒకే సబ్జెక్టును స్పెషలైజేషన్ గా మూడేళ్ల పాటు చదివే అద్భుత అవకాశం.
- ఇన్కమ్ సర్టిఫికెట్ ఉన్నవారికి ఉచితంగా అడ్మిషన్.
- రానున్న 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం.
- తెలంగాణ మల్టీ జోన్-1లో ఈ కోర్సు గల ఏకైక కళాశాల ఇదే.
బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రానున్న 2026-27 విద్యా సంవత్సరం నుంచి బిఏ ఆనర్స్ అనే అద్భుతమైన డిగ్రీ కోసం అందుబాటులోకి రానుందని ప్రముఖ విద్యావేత్త ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్ తెలిపారు. ఉన్నత విద్యా వ్యవస్థలో వినూత్నమైన మార్పులు తీసుకువస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం... పోటీ ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులకు జీవనోపాధి పెంచే విధంగా కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకువస్తోందని వివరించారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో కొత్త కొత్త కోర్సులు ప్రవేశపెడుతోంది. ఈ మేరకు బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు బిఏ ఆనర్స్ అనే ప్రతిష్టాత్మక కోర్సును కేటాయించింది. ఢిల్లీ యూనివర్సిటీ మరియు సెంట్రల్ యూనివర్సిటీలలో మాత్రమే అందుబాటులో ఉన్న బిఏ ఆనర్స్ అనే కోర్సు ఇప్పుడు మన బెల్లంపల్లి పట్టణంలో అందుబాటులోకి వస్తుంది.
- ఈ కోర్సులో ప్రవేశానికి అర్హులు వీరే-
బిఏ ఆనర్స్ కోర్సులో చేరడానికి ఇంటర్మీడియట్ తత్సమాన కోర్సులతోపాటు పాలిటెక్నిక్ డిప్లమా చేసిన వారు కూడా అర్హులే. ఇంటర్మీడియట్లో హెచ్ఈసి, సిఇసి, బైపిసి, ఎంపీసీ, కోర్సులతోపాటు ఒకేషనల్ చదివిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని కోర్సుల విద్యార్థులు కూడా చదవగలిగే సబ్జెక్టును ఈ డిగ్రీలో ఎంచుకోవచ్చు.
-- మల్టీ జోన్-1లో ఏకైక కళాశాల --
బిఏ ఆనర్స్ అనే కోర్సు సగం తెలంగాణకు చెందిన మల్టీ జోన్-1లో ఏ ఒక్క డిగ్రీ కళాశాలలో కూడా లేదు. కానీ ఇప్పుడు ఆ అరుదైన ఘనత బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల దక్కించుకుంది. రానున్న 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఈ కళాశాలలో బిఏ ఆనర్స్ అనే కోర్సు దోస్త్ అడ్మిషన్ల ద్వారా ప్రారంభం కానుంది. ఒకే సబ్జెక్టును స్పెషలైజేషన్ గా తీసుకొని మూడేళ్ల పాటు చదవడం ద్వారా ఆ సబ్జెక్టులో అత్యున్నతమైనటువంటి పట్టు సాధించే అవకాశం ఈ కోర్సు ద్వారా ఉంటుంది.
--- అంచెలంచెలుగా ఎదుగుతున్న బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ---
బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల గురించి చెప్పాలంటే 2018 కి ముందు ఆ తర్వాత అని చెప్పాలి. 2018కి ముందు కేవలం ఆర్ట్స్, కామర్స్ కోర్సులలో వందకు అటు ఇటుగా మాత్రమే స్ట్రెంత్ ఉండేది. కానీ 2019 నుంచి సైన్స్ కోర్సులు కూడా ప్రారంభమయ్యాయి. ఫిజికల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్ హార్టికల్చర్ ఫిషరీస్ బాటని జువాలజీ కెమిస్ట్రీ కంప్యూటర్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. బీఏ, బీకాం, బీఎస్సీ అన్ని కోర్సులలో క్రమంగా స్ట్రెంత్ పెరుగుతూ వస్తూ ఒక దశలో 840కి పైగా అయ్యింది. బీకాం టాక్సేషన్, బీకాం బి ఎఫ్ ఎస్ ఐ , బీకాం ఈ కామర్స్ ఆపరేషన్స్ , బీకాం కంప్యూటర్స్ వంటి కొత్త కోర్సులు వచ్చాయి. ఇప్పుడు బిఏ ఆనర్స్ రాకతో కళాశాల అభివృద్ధి మరింత ఉన్నత స్థితికి చేరనుంది.
- బిఏ ఆనర్స్ తో ఉజ్వల భవిష్యత్తు: ప్రిన్సిపాల్.
బిఏ ఆనర్స్ కోర్స్ ద్వారా విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ప్రముఖ విద్యావేత్త ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్ తెలిపారు. ఆదాయ ధ్రువీకరణ పత్ర సమర్పణతో దరఖాస్తు చేసుకుంటే ఫీజు ఉండదని ఉచితంగా చదువుకోవచ్చు అని సూచించారు. యుపిఎస్సి, టిఎస్పిఎస్సి వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఇటువంటి కోర్సులు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. డిగ్రీ అడ్మిషన్ల కోసం దోస్త్ నోటిఫికేషన్ రాగానే ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. వివరాలకు 9959269975 నెంబర్ లో సంప్రదించాలని తెలిపారు

