ఫ్లాష్ న్యూస్:- రైతులపై అక్రమ కేసులు వెంటనే ఎత్తి వేయాలి:TRP జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రాంటెంకి.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:-  ఆరు గాలం కస్టపడి పండించిన పంట ను కొనుగోలు చేయాలని ఆందోళన చేసిన రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టడాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తీవ్రంగా కండించారు.


గత నెల 20న వర్షాలు పడితే ధాన్యం తడిసి పోతుంది ధాన్యం కొనుగోలు చేయాలని రోడ్డుపై గొల్లపల్లికి చెందిన రైతులు రోడ్డుపై ధాన్యపు బస్తాలతో భైటాయించి ధర్నాకు దిగారు. మండల అధికారుల హామీతో రైతులు నిరసన విరమింప చేశారు. గుట్టు చప్పుడు కాకుండా అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో 3వారాల తరువాత 6గురు రైతులపై అక్రమంగా కేసులు నమోదు చేసారని అందులో ఒకరైతు నాగ్ పూర్ లో ఉన్నప్పటికీ తనపై కూడా కేసు నమోదు చేశారని రైతులు వాపోయారు. కుట్ర పూరితంగా వేసిన కేసులను ఎత్తివేయాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రైతుల పంటను సకాలంలో కొనుగోలు చేయడంలో జాప్యం చేయడమే కాకా నిరసన తెలిపిన వారిపై కేసులు నమోదు చేయడం విడ్డురంగా ఉందని ఎద్దెవ చేశారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by