బ్రేకింగ్ న్యూస్:- ఎన్నికలలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.

D Prashanth Netha
0


DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి పట్టణంలోని BRS పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.


ఈ సందర్భంగా మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర రైతులకు అమలుకాని హామీలిచ్చి మోసపూరిత మాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఇచ్చిన గ్యారెంటీలు, హామీలను విస్మరించిందని తెలిపారు.

- 6 గ్యారెంటీలు, 420 హామీలలో రైతులకు సంబంధించిన రైతుభరోసా, రైతుభీమా, రైతు రుణమాఫీ, బోనస్ లాంటి గ్యారెంటీలు, హామీలను ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజుల్లోనే పూర్తిస్థాయిలో అమలు చేస్తామని బోగస్ మాటలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి సుమారు 30 నెలలు గడిచినా నేటికి ఒక్క గ్యారెంటీ, హామీను కూడా పూర్తిచేయలేదని విమర్శించారు.

- గత BRS ప్రభుత్వం రైతులకు సరిపోయే విధంగా సాగునీరు, నాణ్యమైన విద్యుత్ సరఫరా అయ్యేదని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆ పరిస్థితులు లేవని తెలిపారు.

- కనీసం రైతుల నుండి మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయలేని, రైతులకు సరైన సమయంలో యూరియా కూడా సరఫరా చేయలేని పరిస్థితుల్లో కూడా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం లేదని తెలిపారు.

- ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రశ్నిస్తున్న రైతులను అధికారబలంతో అణిచివేసి అక్రమ కేసులను బనాయించి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తమ తీరు మార్చుకుని రైతులకు ఇచ్చిన అన్ని గ్యారెంటీలను, హామీలను వెంటనే పూర్తిస్థాయిలో అమలుచేయడమే కాకుండా రైతులనుండి ఎలాంటి ఆంక్షలు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, అలాగే రైతులకు సరిపడా యూరియాను కూడా సరఫరా చేయాలని, లేనిపక్షంలో రైతుల పక్షాన BRS పార్టీ తరుపున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

- ఈ కార్యక్రమంలో BRS పార్టీ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by